📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్టిడిపి పార్టీ బలోపేతానికి విస్తృత స్థాయి బూత్ సమావేశం

టిడిపి పార్టీ బలోపేతానికి విస్తృత స్థాయి బూత్ సమావేశం

📰 Generate e-Paper Clip

పేరంనాగరాజునాయుడుఆధ్వర్యంలోనిర్వహణ
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్ 14
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పేడు మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి విస్తృత స్థాయి బూత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం బత్తి నయ్య ఎస్టీ కాలనీ, సదాశివాపురం గ్రామాల పరిధిలోని కందాడు గుడి సమీపంలో జరిగింది.ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జీలు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, గ్రామ పార్టీ కమిటీలు, కేఎస్‌ఎస్ సభ్యులు, పంచాయతీ నాయకులు పాల్గొని పార్టీని బూత్ స్థాయిలో మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.మండల టిడిపి అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సదాశివం పాల్గొన్నారు. బూత్‌లలో ఎదురవుతున్న సమస్యలను లిఖిత పూర్వకంగా నమోదు చేసి, వాటిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో యూనిట్ నాయకులు రవినాయుడు, కేశినేని సుబ్రహ్మణ్యం, అంకయ్య, డా. మునెయ్య, అశ్వద్దామ, సత్యం, మునేశ్వర్, మాధవయ్య, లక్ష్మయ్య, బుల్లయ్య, సూరి, బాబునాయుడు, ఉమాశంకర్, మోహన్ రాజు, ఇంద్రసేనా రెడ్డి, రాజా, రాంబత్తయ్య, శ్రీనివాస రాజు, బాలసుబ్రహ్మ ణ్యం, చెంగలరాయలు, లోకయ్య, ఎస్.కె. వాహిద్, ప్రభాకరయ్య, నాగరాజు, మణి, అయ్యప్ప, పెనగడ్డం మనోహర్ నాయుడు, ముసలిపేడు బూత్ ఇంచార్జి వై. మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.