📄 ePaper
Sunday, November 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

“రాంగ్ రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టిన మరో ద్విచక్ర వాహనం“సంతోషంగా కుమార్తె ఇంటికి బయలుదేరిన దంపతులు.. మార్గమధ్యలో మృత్యుఒడికి చేరిన భర్త
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.నవంబర్22
చిన్నగుండవెల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన చిలుకోటి మల్లారెడ్డి (58),తనభార్య ఇంద్ర (55)తో కలిసి ఆదివారం ఉదయం సుమారు 11 గంటలకు సిద్దిపేటలోని తమ చిన్న కుమార్తె ఇంటికి వెళ్లేందుకు హీరో హోండా హెచ్‌ఎఫ్ డీలక్స్ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
ఈ క్రమంలో ఉదయం 11.15 గంటల సమయంలో చిన్నగుండవెల్లి గ్రామ శివారులోని వెంకటేశ్వర సిమెంట్ బ్రిక్స్ అండ్ టైల్స్ కంపెనీ వద్దకు చేరుకోగానే, సిద్దిపేట నుంచి దుబ్బాక వైపు వెళ్తున్న పల్సర్ ద్విచక్ర వాహనదారుడు అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడుపుతూ రాంగ్ రూట్‌లోకి వచ్చి మల్లారెడ్డి ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో మల్లారెడ్డి, ఆయన భార్య ఇంద్ర రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మల్లారెడ్డి తల ఎడమ భాగంలో తీవ్ర రక్తగాయాలు కాగా, ఇంద్ర తలతో పాటు ఛాతీపై గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన భార్య ఇంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, ఈ ఘటనపై మృతుడి చిన్న కుమార్తె దామరపల్లి సంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.