మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్15
తిరుపతి జిల్లా ఏర్పేడు మండల కేంద్రంలోని ఏర్పేడు గ్రామంలోసోమవారం ఉదయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. గ్రామంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఓం శక్తి మాల ధారణకార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునే మహిళలు భక్తిశ్రద్ధలతో గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ వినాయక స్వామి వారి దేవాలయా నికి చేరుకొని ఓం శక్తి మాలలు ధరించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు, ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు.మాల ధరించిన భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అమ్మవారి నామస్మరణ, భజనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.ఈ సందర్భంగా భక్తులు గ్రామానికి సుఖసంతోషాలు, సమృద్ధి, శాంతి కలగాలని అమ్మవారిని వేడుకు న్నారు.భక్తుల అపూర్వ సమాగమంతో ఏర్పేడు గ్రామం పండుగ వాతావరణాన్ని తలపించింది
ఏర్పేడు గ్రామంలో భక్తుల వెల్లువ ఘనంగానిర్వహించినఓంశక్తిమాలధారణ
RELATED ARTICLES

