📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇల్లంతకుంటసర్పంచ్ మామిడిరాజుకుఘనసన్మానంకాంగ్రెస్ మండలఅధ్యక్షులుకోమటిరెడ్డిభాస్కర్ రెడ్డి చేతులమీదుగాశాలువాసత్కారం

ఇల్లంతకుంటసర్పంచ్ మామిడిరాజుకుఘనసన్మానంకాంగ్రెస్ మండలఅధ్యక్షులుకోమటిరెడ్డిభాస్కర్ రెడ్డి చేతులమీదుగాశాలువాసత్కారం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్16.ఇల్లంతకుంట మండలంలో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యువ నాయకుడు మామిడి రాజును ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోమటి రెడ్డి భాస్కర్ రెడ్డి మామిడి రాజును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ“ఇల్లంతకుంట గ్రామ ప్రజల ఆశీర్వాదంతోనే ఈ విజయం సాధ్యమైంది. ఎన్నికల సమయంలో గ్రామాభివృద్ధి కోసం ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో నెరవేరుస్తాను. ఇది నా వ్యక్తిగత విజయం కాదు, ఇల్లంతకుంట ప్రజల సమిష్టి విజయము” అని అన్నారు. తన గెలుపుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈసన్మాన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని మామిడి రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాభివృద్ధికి కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని ఈ సందర్భంగా నాయకులు వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.