📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుజానకంపల్లిగ్రామాన్నిఅభివృద్ధిబాటలో నడిపిస్తాం.సర్పంచ్ నేల్లిభూదెమ్మ

జానకంపల్లిగ్రామాన్నిఅభివృద్ధిబాటలో నడిపిస్తాం.సర్పంచ్ నేల్లిభూదెమ్మ

📰 Generate e-Paper Clip

297 ఓట్ల మెజారిటీతో ఘన విజయం
జానకంపల్లి ఉప సర్పంచ్‌గా దివిటి వెంకటేష్ ఎన్నిక
మెదక్.మనప్రజాప్రతినిధి//డిసెంబర్15
మెదక్ జిల్లా జానకంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. సర్పంచ్‌గా నెల్లి భూదెమ్మ 297 ఓట్ల మెజారిటీతో అద్భుత విజయాన్ని అందుకోగా, ఉప సర్పంచ్‌గా దివిటి వెంకటేష్ ఎన్నికయ్యారు.ఈ విజయంతో గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. గ్రామస్తులు బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నెల్లి భూదెమ్మ మాట్లాడుతూ,“జానకంపల్లి గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి పథంలో నడిపిస్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి చేరేలా కృషి చేస్తాను. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చుతాను” అని హామీ ఇచ్చారు.ఈ విజయం నేపథ్యంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గ్రామాన్ని సందర్శించి, నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు. ప్రజల విశ్వాసం మరింత బాధ్యతను పెంచిందని, గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.