Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఅగ్నిప్రమాద బాధితుడిని పరామర్శించిన

అగ్నిప్రమాద బాధితుడిని పరామర్శించిన

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట భూంపల్లి మండలం.దుబ్బాకనియోజకవర్గంసిద్దిపేటజిల్లాడిసెంబర్18
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనలో నష్టపోయిన బాధితుడిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య పరామర్శించారు.మండల కేంద్రంలోని పాత ఇనుప సామాన్ల డంపింగ్ యార్డ్‌లో నిన్న ఒక్కసారిగా మంటలు చెలరేగి అక్కడ ఉన్న దుకాణంలోని ప్లాస్టిక్ వస్తువులు, రాగి, సిల్వర్ తదితర సామాన్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో దుకాణ యజమాని దొంతరమైన పర్షరాములు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశారు.
విషయం తెలుసుకున్న చైర్మన్ బక్కి వెంకటయ్య ఘటన స్థలాన్ని సందర్శించి బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుడికి ధైర్యం చెప్పి, తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భూంపల్లి గ్రామ సర్పంచ్ జన్నారెడ్డి, అక్బర్‌పేట గ్రామ సర్పంచ్ మండల కుమార్, మాజీ సర్పంచ్ బుచ్చయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular