Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమద్య మానేరు కుడి కాలువ ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేయాలి

మద్య మానేరు కుడి కాలువ ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

రైతుల తరఫున బీజేపీ నేత పినికాశి అనిల్ గట్టి డిమాండ్
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్19
ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల, రంగంపేట గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మద్య మానేరు కుడి కాలువ ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వంతడుపుల గ్రామం మీదుగా వెళ్లే మద్య మానేరు కుడి కాలువ రైతులకు సాగునీరు అందించే స్థితిలో లేకపోవడం తీవ్ర అన్యాయమని బీజేపీ నాయకులు పినికాశి అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పొలాల్లో సాగుబడి పనులు జరుగుతున్నాయని, నాట్లు వేసే కీలక సమయంలో కూడా కాలువ ద్వారా నీరు విడుదల చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.కుడి కాలువ నీటిపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న రైతులకు ఇది భారీ దెబ్బగా మారుతుందని, అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతులకు మేలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలోభూత్ అధ్యక్షులు పిల్లి గోపాల్,వంతడుపుల 5వ వార్డు సభ్యులు నాయిని శ్రీనివాస్,నాయకులు బోయిని నాగరాజు,
గ్రామస్తులు పండుగ స్వామి, పినికాశి చంద్రయ్య తదితరులు,
స్థానిక రైతులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular