Wednesday, April 15, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఅల్మస్‌పూర్ ఎంపిపిఎస్ పాఠశాలలో పోషణ ఆహారోత్సవం

అల్మస్‌పూర్ ఎంపిపిఎస్ పాఠశాలలో పోషణ ఆహారోత్సవం

📰 Generate e-Paper Clip

అల్మస్‌పూర్‌లో పౌష్టికాహారంపై ఉపాధ్యాయ–తల్లిదండ్రుల సమావేశం
పిల్లల ఆరోగ్యమే లక్ష్యంగా పోషణ ఆహారోత్సవం

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం.సిద్దిపేట జిల్లా
అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని అల్మస్‌పూర్ గ్రామంలోని ఎంపిపిఎస్ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ–తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు ‘పోషణ ఆహారోత్సవం’ కార్యక్రమాన్ని చేపట్టారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు సుప్రియ శ్రీ మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలతోనే సమతుల్య పోషణ సాధ్యమని, తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాల పౌష్టిక ఆహార పదార్థాలను పాఠశాలకు తీసుకువచ్చి ప్రదర్శించారు. వార్డ్ మెంబర్ పోచమైన పద్మ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు పాఠశాల వంటమనిషి చిక్కుడు కనకవ్వ, పంచాయతీ సెక్రటరీ కీర్తన, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వెంకటమ్మ, అంగన్వాడీ ఆయా భాగ్య, బండారు శ్యామల, పోచమైన మాధురి, మండల ఎల్లవ్వ, బండారు ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.పిల్లల్లో పౌష్టికాహారంపై అవగాహన పెంపొందించడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular