📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకొలనూరు గ్రామానికి నూతన ప్రజాస్వామ్య వెలుగులు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం

కొలనూరు గ్రామానికి నూతన ప్రజాస్వామ్య వెలుగులు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా.డిసెంబర్ 22:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఉత్సాహభరితంగా, ప్రజల నడుమ ఘనంగా జరిగింది. గ్రామాభివృద్ధిపై నూతన ఆశలను రగిలిస్తూ ప్రజలతో పాటు నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌గా జలగం అరవింద్, ఉప సర్పంచ్‌గా బిట్ల బాబు ప్రమాణ స్వీకారం చేసి గ్రామ ప్రజలకు సేవ చేయనున్నట్లు ప్రతిజ్ఞ చేశారు.అలాగే వార్డు సభ్యులుగాబిట్ల దేవలక్ష్మి, తుమ్మల సురేష్, బోలగం కమలాకర్, వీరవేణి భాగ్య, కాదాసు లత, ఓరుగంటి శంకర్, సంకినేని మంజుల, పల్లె పరమేశ్వర్, మెరుగు బానుప్రమాణ స్వీకారం చేసి తమ తమ బాధ్యతలను స్వీకరించారు.ప్రమాణ స్వీకారానంతరం నూతన పాలకవర్గం మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం అవసరమని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు, యువత, మహిళలు నూతన పాలకవర్గానికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతూ, కొలనూరు గ్రామం అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular