📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి

సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి

📰 Generate e-Paper Clip

APK ఫైల్ ఓపెన్ చేయడంతో రూ.13 లక్షలు గల్లంతు
సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక
ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్లజిల్లా.డిసెంబర్25
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ట్రాన్స్‌కో ఉద్యోగి ఆవునూరు భాస్కర్ సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.13 లక్షలు కోల్పోయాడు. భాస్కర్ మొబైల్ ఫోన్‌కు వచ్చిన అనుమానాస్పద APK ఫైల్‌ను ఓపెన్ చేయడంతో అతని ఫోన్ హ్యాక్ అయి, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సైబర్ మోసగాళ్లు కాజేశారు.కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి ప్రాంతంలో ట్రాన్స్‌కో లైన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న భాస్కర్, తన ఖాతాలోని డబ్బులు ఒక్కసారిగా మాయం కావడంతో లబోదిబో మంటున్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డిజిటల్ లావాదేవీల వివరాలు సేకరించి సైబర్ నేరగాళ్లనుగుర్తించేపనిలో నిమగ్నమ య్యారు. అనుమానాస్పద లింకులు, APK ఫైళ్లను ఓపెన్ చేయవద్దని ప్రజలకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.