📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్భారతీయ సంస్కృతి పరిరక్షణకు నిదర్శనం-ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు బత్తలగిరి నాయుడు ఘన స్వాగతం

భారతీయ సంస్కృతి పరిరక్షణకు నిదర్శనం-ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు బత్తలగిరి నాయుడు ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

•హిందూ సంస్కృతి, ధార్మిక విలువల రక్షణలో RSS కీలక పాత్ర – మోహన్ భగవత్‌కు ఆదర్శనీయ స్వాగతం
భారతీయ హిందూ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తి RSS – తిరుపతిలో మోహన్ భగవత్‌కు ఘన సన్మానం

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్26
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా తిరుపతి సరస్వతి విద్యాపీఠంలో శుక్రవారం నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం రాజకీయ–సాంస్కృతికంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో ఈ సమ్మేళనం ఆలోచనాత్మకంగా, ప్రభావవంతంగా కొనసాగింది.ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బత్తల గిరి నాయుడు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే ప్రత్యేక గ్రంథాన్ని మోహన్ భగవత్‌కు అందజేయడం ద్వారా భారతీయ ధార్మిక–సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.అదేవిధంగా సమ్మేళనానికి హాజరైన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులకు ఐదు భాషల్లో ప్రచురితమైన శ్రీపరశురామేశ్వర స్వామి దేవస్థానం చరిత్ర పత్రికను ఆలయ సిబ్బంది ద్వారా అందజేశారు. భారతీయ సంస్కృతి, దేవాలయ సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఆలయ దర్శనానికి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం సంస్కృతి–రాజకీయాల సమన్వయానికి ప్రతీకగా నిలిచిందని, భారతీయ విలువల పరిరక్షణ లో ఆర్ఎస్ఎస్ పాత్ర మరింత బలపడుతోందని పలువురు 1అభిప్రాయపడ్డారు. దేవాలయాలు కేవలం ఆరాధనకే కాకుండా, సంస్కృతి సంరక్షణ కేంద్రాలుగా నిలవాలన్న సందేశం ఈ సమ్మేళనం ద్వారా స్పష్టంగా వెలువడింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.