•పూజలో పాల్గొన్న ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి
సదాశివపేట,డిసెంబర్26(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో కేశవ్ గురు స్వామి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముత్తంగి నర్సింగ్‌రావు భజన మండలి ఆలపించిన భక్తిగీతాలతో ఆలయ ప్రాంగణం భక్తి పరవశంతో నిండిపోయింది. ఈమహోత్సవంలో అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు వేలాదిగా పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు చింత సాయినాథ్, మాజీ జడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు అపర్ణ శివరాజ్ పాటిల్, పట్నం విజయలక్ష్మి సుభాష్, గురుస్వామి చింత గోపాల్, మాజీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
RELATED ARTICLES

