Monday, March 2, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం

బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలి
మనప్రజాప్రతినిధి// ఏర్పేడు మండలం.డిసెంబర్27

ఏర్పేడు మండలంలోబాలికలపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టడంతో పాటు వారి భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా  సిడిపిఓ కృష్ణవేణి మాట్లాడుతూ బాలికల భద్రతకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.స్కూల్‌కు వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో బాలికలు అప్రమత్తంగా ఉండాలని, 18 ఏళ్ల లోపు బాలికలు, 21 ఏళ్ల లోపు బాలుర మధ్య అనుచిత సంబంధాలు ఏర్పడకుండా. చిన్న వయసులో వివాహం జరిపించడం వల్ల శారీరక మానసిక అనారోగ్యాలకు గురవుతారని చిన్నవయసులో గర్భం దాల్చడం వల్ల మాత మరణాల రేటు అధికంగా ఉంటుందని ఇలాంటి ఇబ్బందుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు ధైర్యం కలిగించేలా మాట్లాడాలని, ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా వెంటనే కుటుంబ సభ్యులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ లైన్ నంబర్ 1098 కు సమాచారం అందిస్తే తక్షణ సహాయం లభిస్తుందని పేర్కొన్నారు. బాలికల హక్కుల పరిరక్షణలో మహిళా సంఘాలు, గ్రామస్థులు కీలక పాత్ర పోషించాలని వక్తలు అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రగతి కోఆర్డినేటర్ శిరీష, సూపర్వైజర్లు రత్నమ్మ, అనిత, భారతి, అలాగే అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు. బాలికల భద్రత, వారి భవిష్యత్ కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular