📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపార్టీలకతీతంగా సమిష్టిగా కృషి చేస్తాం గ్రామాల అభివృద్ధే లక్ష్యం.

పార్టీలకతీతంగా సమిష్టిగా కృషి చేస్తాం గ్రామాల అభివృద్ధే లక్ష్యం.

📰 Generate e-Paper Clip

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంగి కృష్ణ
మనప్రజాప్రతినిధి,నర్సాపూర్.డిసెంబర్27
వెల్దుర్తి మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంగి కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.మీడియాతో మాట్లాడిన రంగి కృష్ణ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం సర్పంచులకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకునేలా సర్పంచుల ఫోరం నిరంతరం పనిచేస్తుందన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సర్పంచులంతా ఐక్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పూర్తిస్థాయిలో గ్రామాభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎక్కడైనా ప్రభుత్వం నుంచి నిధులు నిర్లక్ష్యం జరిగితే, సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో అందరం కలిసి పోరాడి నిధులు తీసుకొచ్చి గ్రామాలను పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తనను సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు కోదండ కృష్ణ గౌడ్, రంగారెడ్డి, ఉపసర్పంచ్ కమ్మరి శ్రావణ్ కుమార్, వార్డు మెంబర్ సాకారం శ్రీనివాస్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.