📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్30
తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.ముఖ్యమంత్రి విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు అధికారి కంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి కి పుష్పగుచ్ఛం అందజేస్తూ సాదరంగా ఆహ్వానించారు.అదేవిధంగా శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడుతో పాటు, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకొని ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేయగా, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టింది.ముఖ్యమంత్రి పర్యటన జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.