•దౌల్తాబాద్ ఎస్సై జి. అరుణ్ కుమార్ హెచ్చరిక
దౌల్తాబాద్,డిసెంబర్30(మనప్రజాప్రతినిధి)
నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్30రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ ఎస్సై జి. అరుణ్ కుమార్ సూచించారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించకూడదని ఆయన హెచ్చరించారు. తాగి వాహనాలు నడపడం, రోడ్లపై గందరగోళం సృష్టించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి చర్యలను పోలీసులు ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై తప్పనిసరిగా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎస్సై అరుణ్ కుమార్, నూతన సంవత్సరాన్ని శాంతియుతంగా, ఆనందంగా జరుపుకోవాలని, కుటుంబ సభ్యులతో సురక్షితంగా వేడుకలు నిర్వహించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక గస్తీ, వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రజల భద్రతే లక్ష్యం-నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక గస్తీ
RELATED ARTICLES

