మనప్రజాప్రతినిధి//సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని రేణుకానగర్ కాలనీలో విశేష్ ఇంటికి వెళ్లి BDSF బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య BLTU బహుజ లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో విశేష్ కు సాల్వకపి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బేట ఆనంద్ మాట్లాడుతూపది’ ఫలితాల్లో కొమ్ము విశేష్ మంచి ఫలితాలు సాధించాడు 29/4 బుధవారం రోజున విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో మం,,జిల్లా, సిద్దిపేట గ్రా,రావురుకుల గ్రామానికి చెందిన కొమ్ము దుర్గారాములు కుమారుడు కొమ్ము విశేష్ ప్రతిభకనబరచాడు. ‘పది’లో విశేష్ 96.6శాతం మార్కులు సాధించి రికార్డు సృష్టించాడు. ఈ బాలుడు రావురుకుల గ్రామంలో ఓకటవ తరగతి నుంచి ఎనిమిదోవ తరగతి వరకూ చదివి తరువాత సిద్దిపేట జిల్లా కేంద్రంలో నీ శ్రీవాణి హైస్కూల్ లో తొమ్మిదో తరగతిలో చేరి పదవ తరగతిలో పాఠశాలలో చదవివాడు. శ్రీవాణి పాఠశాలలో విశేష్ 96% స్థానంలో నిలిచాడు. గ్రామీణ ప్రాంతంలో జన్మించిన విశేష్ ఈ పది ఫలితాల్లో 96శాతం మార్కులు సాధించడం రికార్డు అని పలువురు అంటున్నారు. కొమ్ము దుర్గారాములు, తల్లి జ్యోతి కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందించారు. విశేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిష్టించాలని వారు కోరుకున్నారు. అదేవిధంగా తేదీ 10/5/2026 ఆదివారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సిద్దిపేట రూరల్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో ప్రథమ,ద్వితీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత మైన చదువులపై అవగాహన తధానంతరం సన్మాన కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి విద్యార్థిని ,విద్యార్థులు తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయగలరని కోరారు .ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎర్ర కృష్ణ, చందులపురం, కోటేశ్వరరావు. బిఎల్టియు ట్రేడ్ యూనియన్ శివరాత్రి శ్రీనివాస్ , ర్యాకం మహేష్,తదితరులు పాల్గొన్నారు.

