Tuesday, March 17, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రామీణ ప్రతిభకు వేదికగా వాలీబాల్-సిరిసిల్లలో క్రీడాభివృద్ధి ప్రయత్నాలు

గ్రామీణ ప్రతిభకు వేదికగా వాలీబాల్-సిరిసిల్లలో క్రీడాభివృద్ధి ప్రయత్నాలు

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసిన జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు
రాజన్నసిరిసిల్ల,(మనప్రజాప్రతినిధి):డిసెంబర్30
జిల్లాలో వాలీబాల్ క్రీడను అగ్రపథంలో నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో క్రీడాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. వాలీబాల్ క్రీడకు పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడంఅధునాతన వసతులతో కూడిన కోచింగ్ అందించడంశిథిలావస్థలో ఉన్న క్రీడా మైదానాల అభివృద్ధిజిల్లా స్థాయిలో మరిన్ని వాలీబాల్ టోర్నమెంట్ల నిర్వహణ
యువతను క్రీడల వైపు మళ్లించేలా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టడంవంటి అంశాలపై సహకారం అందించాలని విన్నవించారు.
ప్రతినిధుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించేలా అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వాలీబాల్ క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ పరంగా తక్షణమే కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా క్రీడల అధికారి రామదాసు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, ఉపాధ్యక్షుడు సంఘ స్వామి, మైలారం తిరుపతి తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular