📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో విద్యార్థిని కావ్యకు డబుల్ గోల్డ్

రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో విద్యార్థిని కావ్యకు డబుల్ గోల్డ్

📰 Generate e-Paper Clip

అభినందించిన జీజేసీ ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి
సిద్దిపేట నియోజకవర్గం. మనప్రజాప్రతినిధి//డిసెంబర్ :
ఒక నాణానికి బొమ్మ, బొరుసు ఎంత ముఖ్యమో… విద్యార్థిజీవితంలో చదువు, క్రీడలు కూడా అంతే ముఖ్యమని సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో–ఎడ్యుకేషన్) ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి అన్నారు.ఎస్‌జీఎఫ్ అండర్–19 విభాగంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో ట్రాక్ ఈవెంట్, రోడ్ ఈవెంట్‌లలో రెండు బంగారు పతకాలు సాధించిన కళాశాల విద్యార్థిని బరిగే కావ్యను బుధవారం కళాశాలలో ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ…రెండు విభాగాల్లోనూ స్వర్ణ పతకాలు సాధించి కావ్య కళాశాలకే కాకుండా జిల్లాకు గర్వకారణంగా నిలిచిందన్నారు. ఆమె సాధించిన ఈ విజయంలో కృషి, పట్టుదల, క్రమశిక్షణ కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థులు కావ్యను ఆదర్శంగా తీసుకుని చదువుతోపాటు తాము ఎంచుకున్న క్రీడల్లో నిరంతర సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ అశోక్, ఏజీఎంసీ దేవయ్య, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్ కనక చంద్రం, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దరిపల్లి నాగేష్‌తో పాటు అధ్యాపకులు వెంకటరమణ, రఘురాజు, గంగాధర్, ఫాతిమా, రాజ్యలక్ష్మి, కౌసర్, బేతి శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, సత్యనారాయణ, ప్రసాద్, చక్రవర్తి, అఖిల్, రవి, విజయ భాస్కర్, రాజశేఖర్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.