మొగుడంపల్లి జనవరి 2 (మనప్రజాప్రతినిధి)
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్ పల్లి తాండ జనవరి 1వ తేదీ మోతి మాత అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ మోతి మాత అమ్మవారి జాతరకు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది ఈ జాతర జనవరి 2వ తేదీ నుండి 3వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ జాతరలొ భక్తుల సౌకర్యార్థ ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం కొరకు క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు మంచినీటి సమస్యలు తలెత్తకుండా సంపూర్ణంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాతరకు వచ్చే భక్తుల నిమిత్తము వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతరకు పరిశుద్ధ కార్మికుల కూడా ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి దర్శనానికి రోజువారీగా టికెట్లు తీసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద భక్తజనంతో కిటకిటలాడుతూ భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూమోతిమాత అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని ఈ జాతర ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడానికి పోలీస్ శాఖ వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది

