మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్3
తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలో అనుమతి లేని వడ్డీ వ్యాపారస్తులు పేద, మధ్యతరగతి కుటుంబాలను తీవ్రంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వడ్డీ వ్యాపారం రోజువారీ, వారపు, పదిహేను రోజుల వడ్డీ, నెలవడ్డీ ఇలా వివిధ పేర్లతో కొనసాగుతోంది. బాధితులు చెప్పినట్టే, రూ.100కు రూ.20 నుంచి రూ.40 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు.వడ్డీ చెల్లించలేని పరిస్థితిలో ద్విచక్ర వాహనాలు, ఇంట్లోని విలువైన వస్తువులను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. కొందరు వాహనాలను తమ అవసరాలకు వినియోగిస్తున్నా రన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్లినప్పుడు “చంపేస్తాం” అని బెదిరింపులకు గురవుతారని వాపోతున్నారు. ఇంట్లో లేని సమయంలో కుటుంబ సభ్యులను భయపెడుతూ, ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని సమాచా రం. కొంతమంది భయంతో మౌనం వహిస్తుండగా, మరికొందరు ప్రాణభయంతో బయటకు రాలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నా రు. కొన్ని చోట్ల ఆత్మహత్యల ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంటున్నారు.ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు స్పందించ డంలేదని ప్రశ్నిస్తూ, అక్రమ వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేయడం, ప్రత్యేక దాడులు చేపట్టడం, బాధితులకు రక్షణ కల్పించడం వంటి చర్యలు వెంటనే చేపట్టాలన్న డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యాన్ని ఆసక్తిగా గమనిస్తూ, శ్రీకాళహస్తి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి జనమాల గురవయ్య ప్రభుత్వాన్ని త్వరిత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన పత్రికా ప్రకటన ద్వారా “ఎర్పేడు మండలంలో పేద, మధ్యతరగతి కుటుంబాలను నష్టం చేయడం కట్టడి కావలసిన అవసరం ఉంది. వడ్డీ వ్యాపారస్తులపై ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలి” అని ప్రజలకు హామీ ఇచ్చారు.స్థానికులు వడ్డీ వ్యాపారుల వెనుక ఉన్న రాజకీయ నేతలు, రౌడీ నాయకులు, ఇతర ప్రాంత వాసులైన వీరే ఈ దందాను కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విధమైన రాజకీయ, సాంఘిక రక్షణతో వ్యాపారస్తులు భయమాట చెప్పకుండా దోపిడీ కొనసాగిస్తు న్నారని ప్రజలు గట్టి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధి తెలుగు దినపత్రిక ఈ వ్యవహారంపై సాక్షాధారాలతో కూడిన ప్రత్యేక కథనాన్ని త్వరలో ప్రచురించనుంది. బాధితులు భయాన్ని వీడి ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించాలంటూ పిలుపునిచ్చారు.
ఎర్పేడు మండలంలో అక్రమ వడ్డీ దందా:ప్రజల జీవితం నాశనం-సిపిఐ డిమాండ్ చర్యలు తీసుకోవాలి
RELATED ARTICLES

