📄 ePaper
Monday, June 29, 2026
Homeతెలంగాణసిరిసిల్లలో ‘కాత్యాయని’ కంటి ఆసుపత్రి ప్రారంభించిన ప్రభుత్వ విప్

సిరిసిల్లలో ‘కాత్యాయని’ కంటి ఆసుపత్రి ప్రారంభించిన ప్రభుత్వ విప్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి/ రాజన్నసిరిసిల్ల
జనవరి ,04

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాత్యాయని కంటి ఆసుపత్రిని ఆదివారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం, అక్కడ అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వంటి పట్టణాల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన కంటి ఆసుపత్రులు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, రోగుల పట్ల కనికరంతో ఉంటూ వారి మన్ననలు పొందాలని కోరారు. ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular