Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుడ్రైవర్లకు ఉచిత కంటి, ఆరోగ్య పరీక్షల శిబిరం

డ్రైవర్లకు ఉచిత కంటి, ఆరోగ్య పరీక్షల శిబిరం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి4
రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో డ్రైవర్ల కోసం ప్రత్యేక ఉచిత కంటి, సాధారణ ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 200 మంది సరుకు రవాణా, ప్రయాణికుల వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ప్రమాదాల నివారణే ధ్యేయంఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి (DTO) లక్ష్మణ్ మాట్లాడుతూ, డ్రైవర్లకు మంచి కంటి చూపు ఉండటం ద్వారానే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. నిరంతరం వాహనాలు నడిపే డ్రైవర్లు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా కంటి చూపును తరచూ పరీక్షించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు:వంశీధర్-మోటారు వాహనాల తనిఖీ అధికారి (MVI)రజని – సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి (AMVI)పృథ్వీరాజ్ వర్మ – సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి (AMVI)సంగీతం శ్రీనాథ్ – RTA మెంబర్.రవాణా శాఖ కార్యాలయ సిబ్బందిడ్రైవర్లందరికీ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు, వైద్య సలహాలు అందజేశారు. రవాణా శాఖ చేపట్టిన ఈ ప్రజాహిత కార్యక్రమంపై డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular