Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణబిఆర్ఎస్‌లోకి భారీ చేరికలు గులాబీ గూటికి ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్

బిఆర్ఎస్‌లోకి భారీ చేరికలు గులాబీ గూటికి ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిది
రాజన్న సిరిసిల్ల
జనవరి 04

కోనరావుపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ వర్గాల ప్రజలు, నాయకులు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా నిజామాబాద్ గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్ తన అనుచరులతో కలిసి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.మల్కపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో సింగం ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. వీరికి చల్మెడ లక్ష్మీనరసింహారావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ “క్షేత్రస్థాయిలో పార్టీకి కార్యకర్తలే అసలైన బలం. సింగం ప్రసాద్ వంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు పార్టీలోకి రావడం చాలా సంతోషకరం. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలన్నరు
ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్ మాట్లాడుతూ “తెలంగాణలో జరిగిన అభివృద్ధి చూసి ఆకర్షితుడినయ్యాను. అందుకే బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను. నా వెంటే ఉన్న వంద మంది అనుచరులతో కలిసి పార్టీ సైనికులుగా పనిచేస్తాం.”
ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular