మనప్రజాప్రతినిధి//రాయికోడ్:
స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇటికేపల్లి గ్రామ సర్పంచ్ తమ్మలి రాజు నిలబెట్టుకున్నారు. సర్పంచ్‌గా తనను గెలిపిస్తే గ్రామంలో నీటి సమస్య లేకుండా చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్‍గా ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు గడవక ముందే బోర్ వేయించి ఆదివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తమ్మలి రాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అందరికి అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తమ నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్‍కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. బోర్ ప్రారంభోత్సవంలో ఉప సర్పంచ్ ఎర్రోళ్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, పాంపాడ్ రాజు, పి.ప్రకాశ్. కె.చంద్రశేఖర్, మేత్రి పెంటన్న మైత్రి విటల్ గొండ, తట్టిపల్లి వీరారెడ్డి, బోజిరడ్డి పాండురంగారెడ్డి, ఆకుల విఠన్న, దూదేకుల గున్ను మియా, ఆకుల పండారినాథ్, కమ్మరి నర్సింహులు దూదేకుల హైమద్, పాషామియా, జూకంటి సుభాష్, కె.నాగేశం, పి.అశోక్, ఎస్.సంజీవ్,ఎం. విజయ్, నాగారం దత్తు, గ్రామస్తులు పాల్గొన్నారు.

