Thursday, March 19, 2026
ads
Homeతెలంగాణఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జ్యోతి చైతన్య సేవా సంఘం.

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జ్యోతి చైతన్య సేవా సంఘం.

📰 Generate e-Paper Clip

చిలకలూరిపేట,జనవరి – 04 (మనప్రజాప్రతినిధి):

పట్టణంలో గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాలకు పూలదండలు వేసి సావిత్రిబాయి పూలే  195వ జయంతి వేడుకలు జ్యోతి చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రథమ మహిళ ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా సమాజానికి తెలిపిన  మహిళా సావిత్రిబాయి పూలే అని వారు అన్నారు. 175 సంవత్సరాల క్రితం మహిళలకు విద్య చాలా అవసరం అని, మహిళల విద్య నేర్చుకోవాలని మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు ఎంతో కృషి చేశారని వారు తెలిపారు. భారతదేశంలోనే మొదటి మహిళ పాఠశాల నిర్మించి భారతదేశంలోనే సావిత్రిబాయి పూలే కీర్తి గడించారని వారు అన్నారు.కార్యక్రమంలోఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జ్యోతి చైతన్య సేవా సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పాల భాస్కరరావు, ఉపాధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి మారుబోయిన శ్రీనివాసరావు, చిలకలూరిపేట జ్యోతి చైతన్య సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు నిడమానూరు వెంకట్, కోమరువల్లిపాడు మాజీ సొసైటీ చైర్మన్ కొండవీట ఆంజనేయులు, కమిటీ సభ్యులు దామర్ల మనోహర్, దాసరి శ్రీనివాసరావు,బీసీ నాయకులు ఉండవల్లి కోటేశ్వరరావు, దాసరి వెంకటేశ్వర్లు,కొండవీటి గోపికృష్ణ, నూతలపాటి వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షురాలు గుంజీ పద్మావతి,  సిపిఐ నాయకులు నాయుడు  శివకుమార్, పోటు శ్రీ నివాసరావు,ఎంప్లాయిస్ స్టేట్ సెక్రటరీ పొన్నూరి హరినాథ్ బాబు,ఉప్పాల మునీశ్వరావు,  కంచర్ల శ్రీనివాసరావు,గీత కార్మికుల సంఘం  ఆర్టీసీ యూనియన్ సెక్రటరీ వరప్రసాద్,మాజి కౌన్సిలర్ నిడమానూరు హనుమంతరావు,
బ్రిలియంట్ స్కూల్ అధినేత శ్రీనివాసరావు, స్కూల్ విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular