_మమకారాన్ని పెంచుకోండి
ఆంగ్లంపై ప్రావీణ్యం పెంచుకోండి
_ప్రపంచ తెలుగు మహాసభ లోముఖ్యమంత్రి చంద్రబాబు ,,కేంద్రమంత్రిపెమ్ సాని )
గుంటూరు, జనవరి 5( మనప్రజాప్రతినిధి):
మధురమైన మాతృభాష తెలుగు పై మమకారాన్ని, ప్రేమనుప్రపంచంలోని, దేశం లోని ,తెలుగు రాష్ట్రాల్లోనితెలుగు వారంతా పెంపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరు శవార్లోని శ్రీ పుట్టపర్తి సాయిబాబా ఆధ్యాత్మిక ప్రాంగణంలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగుమహా సభల ముగింపు కార్యక్రమానికి వారు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగు భాష అభివృద్ధికి పురోభివృద్ధికి 10 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడం జరిగిందని అన్నారు.సినిమా ఈవెంట్లకు వచ్చినట్టుగా 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు పెద్ద ఎత్తున జనం రావడం సంతోషగాయకమన్నారు.
మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమే ప్రపంచ తెలుగు మహాసభలుఅన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరుతో వేదిక ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందిఅన్నారు.
వందలాది భాషలు ఉన్నా… కేవలం ఆరు భాషలకు ప్రాచీన హోదా లభించిందన్నారు. అందులో తెలుగు ఉండడం గర్వకారణమన్నారు.
ప్రపంచంలో 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారన్నారు. ఈ సమావేశానికి కూడా 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం హర్షించదగ్గ పరిణామన్నారు.కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరధి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాష కోసం పని చేశారన్నారు. తెలుగుసాంస్కృతిక వైభవం చాటారన్నారు.తెలుగు తీయదనాన్ని తెలిపేవేమన, సుమతీ, భాస్కర పద్యాలు మరిచిపోలేమన్నారు.పిల్లలకు తెలుగు భాష పట్ల మమకారం పెంచేలా చేయాలన్నారు. తెలుగు భాష ఎక్కడికీ పోదనీ, శాశ్వతంగా ఉంటుందనీ అన్నారు.అన్నమయ్య, వెంగమాంబ, మొల్ల వంటి వారు భక్తి మార్గంలోనూ తెలుగుకు వెలుగు తెచ్చారన్నారు.
విశ్వనాధ సత్యనారాయణ, సినారె, రావూరి భరద్వాజ వంటివారికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాన్నారు.తెలుగును గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషకు తెచ్చేందుకు గిడుగు రామ్మూర్తి చేసిన కృషిని ఎన్నటికీ మరువలేమన్నారు.నేను తెలుగువాడిని. నాది తెలుగుదేశం అని చాటిచెప్పిన ఎకైక నాయకుడు నందమూరి తారక రామారావుఅని గుర్తు చేశారు.తెలుగు వారిని మద్రాసీలని పిలిచే రోజుల్లో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్అన్నారు.తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాడి మరణించిన అమరజీవి పొట్టిశ్రీరాములను మరువలేమన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేందుకు పదవిని త్యాగం చేసిన బూర్గుల కృష్ణారావు ఎప్పుడూతెలుగు ప్రజల హృదయాల్లో గుర్తుంటారన్నారు.ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు కృషి చేసిన రామోజీరావును తెలుగు జాతి మరువదన్నారు.తెలుగుజాతిఔన్నత్యాన్నికాపాడుకోవాలంటేభాషనుపరిరక్షించుకోవాలన్నారు.దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు మనతెలుగు భాష ఔన్నత్యాన్ని, దేశానికి, ప్రపంచాన్ని చాటారని సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రిపేమ్మసాని చంద్రశేఖర్గుర్తు చేశారు. అనంతరం తపాలా కవర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు, అసెంబ్లీ స్పీకర్చింతకాయల అయ్యన్నపాత్రడు,ప్రపంచ తెలుగు భాష పండితులు,దేశ,రాష్ట్రమంత్రులు ,ప్రజాప్రతినిధులు జిల్లా పాలన యంత్రాంగం, నగరపాలనా యంత్రంగం పాల్గొంది.
మాతృభాష తెలుగుకు మరణ శాసనం రానివ్వవద్దు
RELATED ARTICLES

