Thursday, March 19, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్క్రిక్కిరిసిన కలెక్టరేట్ గ్రీవెన్స్ డే

క్రిక్కిరిసిన కలెక్టరేట్ గ్రీవెన్స్ డే

📰 Generate e-Paper Clip

గుంటూరు జనవరి 5 (మనప్రజాప్రతినిధి):

సోమవారం జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ వాస్తవ, డిఆర్ఓ ఖాజావలి తదితరులు ప్రజా అర్జీలను స్వీకరించారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. అలాగే రెవెన్యూ క్లినిక్స్ లో భూ సంబంధమైన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన ఫిర్యాదు కౌంటర్లలో ఫిర్యాదులు వెళ్లి వెత్తాయి. భూములకు సంబంధించిన రెవెన్యూ విషయాలు, సమస్యలను స్థానిక తహసీల్దారులకు బాధితులు నివేదించారు. తమ తమ సమస్యలను విన్నవించారు. న్యాయం చేయాలని అభ్యర్థించారు. పెదవడ్లపూడి గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యలను విన్నవించారు. గ్రామంలోని తమ సుమారు 70 ఎకరాల భూమిని 22 ఏ నుండి తొలగించాలని, రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరుకున్నారు. గత ఏడు, ఎనిమిదేళ్లగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు అని వాపోయారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉపేక్షిస్తే మూకుమ్మడి ఆత్మహత్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ అధ్యక్షులు కడప సలావుద్దీన్ ,అబ్దుల్ కలాం తదితరులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్కు తరలివచ్చారు. మంగళగిరి వద్ద సుమారు వేలకోట్ల రూపాయల దరజేసే అంజుమన్ భూమిని ప్రైవేట్ సంస్థలకు ,ముఖ్యంగా ఐటీ సంస్థలకు కట్టబెట్టి ముస్లిం మతానికి ,సమాజానికి తీరని అన్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందన్నారు. ఇదే విషయమై తాము రాష్ట్ర మంత్రి లోకేష్ కు, మంగళగిరి కార్పొరేషన్ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఇప్పటికే విన్నవించామన్నారు .అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఈప్పటికైనా కమిటీ వేసి వక్స్ భూమిని కాపాడాలని సలావుద్దీన్, కలాం డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కూడా వక్స్ భూములు కార్పొరేట్ పరం చేస్తుంటే సైలెంట్ గా ఉన్నారని.ఇప్పటికైనా ఆయన పెదవి విప్పి ముస్లింల అంజుమన్ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఉపేక్షిస్తే ముస్లిం సమాజంలో ఆయన చరిత్రహీనుడు అవుతారని సలావుద్దీన్, అబ్దుల్ కలాం హెచ్చరించారు. అలాగే గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ డ్వాక్రా, అంగన్వాడి సాధికారిక సంస్థ ప్రధాన కార్యదర్శి లాం నవమి, జిల్లా కలెక్టరేట్లో ఉన్నతాధికారులకు, స్థానిక మహిళలతో కలిసి వినతిపత్రం అందించారు. క్రిస్మస్ రోజున ,జనవరి ఫస్ట్ రోజున తాము, ఎమ్మెల్యే మాధవి ఫోటో ఫ్లెక్సీలతో శుభాకాంక్షలు తెలుపుతూ మార్కెట్ నుండి కలెక్టరేట్ వరకు డివైడర్ల మధ్యలోఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్న మన్నారు. అయితే రెండు గంటల్లోనే కార్పొరేషన్ సిబ్బందినిర్దాక్షణ్ణీయంగా తొలగించ రఅన్నారు. ఇదేమని సిబ్బందిని ప్రశ్నిస్తే కమిషనర్ తొలగించ మన్నారని చెప్పారన్నారు. నగరం మొత్తం మీద, 23వ డివిజన్లో మాత్రమే ఎందుకు ప్లెక్సీలు తొలగిస్తున్నారో కమిషనర్ చెప్పాలని నవమి డిమాండ్ చేశారు. ఫ్లెక్సీల తొలగింపుతో తనకు లక్ష రూపాయలు వరకు నష్టం వచ్చిందని చెప్పారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని నవమి డిమాండ్ చేశారు. అలాగే వివిధ సమస్యలపై పెద్ద ఎత్తున బాధితులు గ్రీవెన్స్ డే లో ఫిర్యాదులు అందించారు. బొంగరాల బీడు కార్మిక శాఖ స్థలంలో నివసిస్తున్న 25 యానాది కుటుంబాలను ఈప్పటికప్పుడే తొలగిస్తున్నారని, ప్రత్యామ్నాయ అవకాశం చూపించి, తొలగించాలని బీసీ సంఘం నాయకుడు జూపూడి శ్రీనివాసరావు, భీమ్సేన నేత నీలాంబరం కోరారు.రాష్ట్రంలో రైతాంగ సమస్యలను యుద్ధప్రాతిపాతికిన పరిష్కరించి పంట కోల్పోయిన నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని భారతీయ కిసాన్ సంగ్ రాష్ట్ర అధ్యక్షులు సదానంద రెడ్డి డిమాండ్ చేశారు. ఆమెరకు గ్రీవెన్స్ డే లో అధికారులకు వినతిపత్రం అందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular