📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణమృత్యుపాశంలా మారిన చంద్రంపేట - కొనరావుపేట X బైపాస్ రోడ్డు

మృత్యుపాశంలా మారిన చంద్రంపేట – కొనరావుపేట X బైపాస్ రోడ్డు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి రాజన్నసిరిసిల్ల
జనవరి,08

చంద్రంపేట నుండి కొనరావుపేట వెళ్లే బైపాస్ X రోడ్డు ప్రస్తుతం ప్రయాణీకులకు నరకాన్ని చూపిస్తోంది. గత కొంతకాలంగా ఈ రోడ్డు పూర్తిగా సిగ్నల్స్  వద్ద గుంతలమయమై, అధ్వాన్నంగా తయారైనప్పటికీ సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం ప్రమాదాలు
బెంబేలెత్తుతున్న ప్రయాణీకులు

ఈ బైపాస్ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. భారీ గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడిపోతుండగా, కార్లు మరియు ఇతర వాహనాలు తరచూ మొరాయిస్తూ యజమానులకు భారీగా ఖర్చు మిగిలిస్తున్నాయి. తాజాగా ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న  పరిస్థితికి అద్దం పడుతోంది.

అధికారుల నిర్లక్ష్యం:

“రోడ్డు మధ్యలో సిగ్నల్స్ వద్ద గుంతలమయమై వాహనాలు ఖరాబ్ అవుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు” అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని,గుంత కనిపించక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వారు పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరియు ప్రజా ప్రతినిధులు స్పందించి, యుద్ధ ప్రాతిపదికన ఈ బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, తదుపరి ప్రాణనష్టం జరగకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.