Friday, March 20, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఆస్తి కోసం అత్తను హత్య చేసిన అల్లుడు… తిమ్మారెడ్డిపల్లిలో విషాదం

ఆస్తి కోసం అత్తను హత్య చేసిన అల్లుడు… తిమ్మారెడ్డిపల్లిలో విషాదం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి8
కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ (వయసు56) అనే మహిళను ఆమె అల్లుడే ఆస్తి కోసం హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది.
గ్రామస్తుల సమాచారం మేరకు రాములమ్మకు చెందిన ఆస్తి విషయ మై గత కొంతకాలంగా కుటుంబంలో వివాదాలు కొనసాగుతు న్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లుడు ఆమెను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.సమాచారం అందుకున్న కుక్కునూరుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ దారుణ ఘటనతో తిమ్మారెడ్డి పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular