📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణబహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

-జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
-రోడ్డు ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవు.

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల
జనవరి, 08

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…ప్రజాశాంతి భద్రతలు,రోడ్డు ప్రమాదాల నివరణయే లక్ష్యంగా  జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం , మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, అందులో భాగంగానే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో లైటింగ్ తక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత సమర్థవంతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని,ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పరిధిలో ప్రతి రోజుల వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుదనిమద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై  కేసులు నమోదు చేయడంతో పాటుగా కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.