మన ప్రజా ప్రతినిధి తెలుగు దినపత్రిక ఖమ్మం కార్పొరేషన్
శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ ఖమ్మం..
శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ పోలీస్ సంక్షేమ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను స్కూల్ చైర్పర్సన్ నిష్టాశర్మ పర్యవేక్షణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి భోగిమంట వెలిగించి సంబరాలకు శ్రీకారం చుట్టారు. సంప్రదాయ దుస్తులతో విద్యార్థులు అలరించారు. రంగవల్లులు, భోగి మంటల నడుమ అత్యంత ఉత్సాహవంతంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ముందుగానే ఈ వేడుకలను నిర్వహించారు.కార్యక్రమంలో ఏ ఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ ఐ కామరాజు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు.
ముందస్తుగా సంక్రాంతి పండుగ సంబరాలు
RELATED ARTICLES

