మనప్రజాప్రతినిధి//ఎర్పేడుమండలం.జనవరి11
తిరుపతి జిల్లా తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నికల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సి.ఆర్. రాజన్ జన్మదిన వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలకు కూటమి ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ జిల్లా-మండల స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని సి.ఆర్. రాజన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావడం విశేషంగా నిలిచింది.
ఎర్పేడు మండలం సీనియర్ నాయకులు దశరథ రామిరెడ్డి ఆధ్వర్యం లో ఏర్పేడు సర్కిల్ వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు హాజరై కేక్ కట్ చేసి సి.ఆర్. రాజన్‌ను అభినందించారు.ఈ కార్యక్రమంలోరేణిగుంట టిడిపి మండల అధ్యక్షులు చిన్నారెడ్డి,ఆమందూర్ గ్రామ సర్పంచ్ గుణ యాదవ్,శ్రీకాళహస్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గాలి కృష్ణవేణి,దశరథ రామిరెడ్డి,ఇతర కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలకు మరింత శోభనిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి కీలక నేతల సందడి అదేవిధంగా ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులు భారీగా హాజరు కావడం సి ఆర్ రాజన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
పార్టీ నాయకులతో అంగరంగ వైభవంగా
సి.ఆర్. రాజన్ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES

