📄 ePaper
Friday, September 4, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిరిసిల్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద జయంతి

సిరిసిల్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద జయంతి

📰 Generate e-Paper Clip

రక్తదాన శిబిరానికి విశేష స్పందన
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,జనవరి12:
స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల టౌన్ సీఐ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏబీవీపీ ఇలాంటి సేవా కార్యక్రమా న్ని నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. దేశ యువత వివేకానందుడి బోధనలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ రక్తదాన శిబిరంలో సుమారు 25 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు విద్యార్థులు చూపిన ఉత్సాహం పలువురిని ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో భాండ్ల నందు (స్టేట్ హాస్టల్స్ కన్వీనర్), లోపెల్లి రాజు రావు (రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్), రుద్రవేణి ధనుష్ (సిరిసిల్ల టౌన్ సెక్రెటరీ), శివకుమార్ (సిరిసిల్ల వైస్ ప్రెసిడెంట్)తో పాటు మహేష్, శ్రీకాంత్, గిరిధర్, శ్రావణ్, మందిర్ ఉమేష్, నితిన్, ప్రవీణ్, సాయి, భూమేష్ తదితర ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.