•విజేతగా11విన్నర్స్ టీమ్
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి15:
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కోలనూరు గ్రామంలో క్రీడా ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన కోలనూరు ప్రీమియర్ లీగ్ (KPL) సీజన్–1 క్రికెట్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరితంగా ముగిసింది.టోర్నమెంట్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగగా, ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన 11 విన్నర్స్ టీమ్ ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. క్రమశిక్షణతో కూడిన ఆటతీరుతో కేపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.విజేత జట్టు సభ్యులకు గ్రామ పాలకవర్గం తరఫున కేపీఎల్ కప్పు మరియు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రతినిధులు మాట్లాడుతూ…పండుగ వేళ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు గ్రామస్థుల మధ్య ఐక్యతను బలోపేతం చేయడంలో ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.మాట ఇచ్చారు… మద్దతుగా నిలిచారు!ఆట కోసం…ఆటగాళ్ల ఉత్సాహం కోసం…టీ-షర్టుల రూపంలో స్పాన్సర్‌గా నిలిచి తమ అభిమానాన్ని చాటుకున్నబి. నారాయణ గౌడ్ (సూర్య భాయ్)బి. వెంకటేష్ గౌడ్లకుక్రీడాకారులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, టోర్నమెంట్ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
కోలనూరులో ఘనంగా ‘కేపీఎల్’ (KPL) సీజన్–1
RELATED ARTICLES

