Saturday, March 21, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఎస్టియు క్యాలండర్ ఆవిష్కరణ

ఎస్టియు క్యాలండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయ సంక్షేమానికి STU నిరంతర కృషి : MEO రాజ ప్రభాకర్ రెడ్డి
సిద్దిపేటనియోజకవర్గం//జనవరి17(మనప్రజాప్రతినిధి):
సిద్దిపేట జిల్లా STU శాఖ రూపొందించిన నూతన క్యాలండర్‌ను సిద్దిపేట మండల అర్బన్ విద్యాధికారి ఏ.రాజప్రభాకర్రెడ్డిశనివారంఘనంగాఆవిష్కరించారు.

ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ… ఉపాధ్యాయ సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడుతున్న సంఘంఎస్టియు అని, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మండల STU అధ్యక్షులు జనగామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను తక్షణమే విడుదల చేయాలని, ఆరోగ్య కార్డులను వెంటనే మంజూరు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులు చేసిన సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని, CPS ఉద్యోగుల కరువు భత్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే 2023 జూలై నుంచి అమలు కావాల్సిన వేతన సవరణను ఆలస్యం లేకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి గంభీర్ రావు, పేట యాదగిరి, ఆర్థిక కార్యదర్శి బోడా రాజు, జిల్లా ఉపాధ్యక్షులు యూసుఫ్, జిల్లా కార్యదర్శి నీలం గురువయ్య, మహమ్మద్ ఫసియోద్దీన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular