•సంక్రాంతి సంబరాలకు క్రీడాపండుగగా మారిన సూపర్ సిక్స్ టోర్నమెంట్
•48 జట్లు…ఐదురోజులఉత్సాహం…శ్రీకాళహస్తిలో క్రికెట్ జోష్
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి17
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో నిర్వహించిన ‘బొజ్జల సూపర్ సిక్స్’ టెన్నిస్ బాల్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా విజయవంతమైంది. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి క్రీడల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో యువ నాయకుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ టోర్నమెంట్‌ను సంకల్ప్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ టోర్నమెంట్‌కు ఎం స్టోర్ ఫ్యాషన్ మాల్ స్పాన్సర్‌గా నిలిచి పూర్తి సహకారం అందించింది.గత ఐదు రోజులుగా కొనసాగిన ఈ క్రికెట్ టోర్నమెంట్లో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన దాదాపు 48 జట్లు పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించాయి. ప్రతిరోజూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాళహస్తికి చెందిన ఎయిర్ ఫోర్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలవగా, సుబ్బు సిక్సర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
విజేత ఎయిర్ ఫోర్స్ జట్టుకు రూ.10,000/-రన్నరప్ సుబ్బుసిక్సర్స్ జట్టుకు రూ.5,000/-నగదు బహుమతులు అందజేశారు.
ఈ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జలవెంకటసుధీర్ రెడ్డి,ఆయన మాతృమూర్తిబొజ్జల బృందమ్మ, ఎం స్టోర్ మేనేజ్మెంట్ కలిసి విజేతలకు ట్రోఫీలు, నగదు పురస్కారాలు అందజేశారు.
ఫైనల్ మ్యాచ్లోఅద్భుత ప్రదర్శన కనబరిచినఇర్ఫాన్(ఎయిర్ ఫోర్స్ జట్టు)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులభించగా, టోర్నమెంట్ మొత్తంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రోషద్ (సుబ్బుసిక్సర్స్ జట్టు)కు మోస్ట్ వాల్యూవబుల్ ప్లేయర్(ఎంవిపి)అవార్డుఅందించారు.
ఇతరఅవార్డులు ఈవిధంగా ఉన్నాయి:
బెస్ట్ బ్యాట్స్‌మన్:మనోజ్(ఈ.సి.సిజట్టు)
బెస్ట్ బౌలర్: వెంకీ(గల్లీ క్రికెటర్స్ జట్టు)
బెస్ట్ టీం:సన్నిధి వీధిజట్టు
ఫెయిర్ ప్లేఅవార్డు:సాయిజట్టు
బెస్ట్ పర్ఫార్మెన్స్ టీం:ఎం.ఎస్.డిరాయల్స్ జట్టు
ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ, క్రీడలను ప్రోత్సహించే విషయంలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముందుండే నాయకుడని ప్రశంసించారు. శ్రీకాళహస్తిలో ఈ స్థాయిలో యువత కోసం క్రీడా టోర్నమెంట్ నిర్వహించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా పోటీలు యువతను శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేస్తాయని తెలిపారు.టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన సంకల్ప్ స్పోర్ట్స్ అకాడమీ మేనేజ్మెంట్ను, స్పాన్సర్‌గా ముందుకొచ్చిన ఎం స్టోర్ ఫ్యాషన్ మాల్ మేనేజ్మెంట్ను ప్రత్యేకంగా అభినందించారు.యువత అభివృద్ధికి పాలనతో పాటు క్రీడల రంగంలోనూ ముందుండి సహకరిస్తున్న బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ యువత రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, ఎం.సుబ్బయ్య, కాసరం రమేష్, టిడిపి నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేశారు.

