📄 ePaper
Sunday, August 30, 2026
Homeఆంధ్రప్రదేశ్యూత్ కాంగ్రెస్ బలోపేతానికి అడుగు-జిల్లాల వారీగా యూత్ అధ్యక్షుల నియామకం

యూత్ కాంగ్రెస్ బలోపేతానికి అడుగు-జిల్లాల వారీగా యూత్ అధ్యక్షుల నియామకం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.జనవరి17
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అన్ని జిల్లాలకు యూత్ అధ్యక్షుల నియామక ప్రక్రియను పార్టీ నాయకత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో తిరుపతి జిల్లా యూత్ అధ్యక్షుల నియామక నిమిత్తం జాతీయ స్థాయి నాయకులు తిరుపతికి విచ్చేశారు.తిరుపతి నగర యూత్ అధ్యక్షులు బీవీ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ యూత్ సెక్రటరీ, ఏపీ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ లెనిన్ (తమిళనాడు)తో పాటు జాతీయ యూత్ కాంగ్రెస్ అనదర్ సెక్రటరీ డి. శ్రీనివాస్ (విశాఖపట్నం) తిరుపతి నగరానికిచేరుకున్నారు.
ఈ సందర్భంగా తిరుపతి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరీపేడు చిట్టిబాబు, సిటీ యూత్ అధ్యక్షులు బీవీ గౌడ్, వంశీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిరంజీవి తదితరులు జాతీయ నాయకులకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం యూత్ అధ్యక్షుల నియామకాలకు సంబంధించి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు నిర్వహించారు.ఈ సమావేశంలో జాతీయ యూత్ నాయకులు మాట్లాడుతూ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు మరియు భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి సహా జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాక ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ
జై కాంగ్రెస్… జై జై కాంగ్రెస్… జైహింద్ అంటూ నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.