“కులాలపై పరిమితులు లేకుండా, కలిసికట్టుగా ఉండి, హిందూ ధర్మాన్ని, సంస్కృతిని రక్షించాలి”
•యువత, మహిళలు సమాజ సేవలో ముందుండాలి
•హిందూ సమాజ ఐక్యతను అందరందరితో పెంపొందించాలి
•రాష్ట్ర స్థాయి స్వయంసేవక సంఘ్, అనుబంధ సంస్థల సభ్యులు ఘనంగా పాల్గొన్నారు.
మనప్రజాప్రతినిధి//తిరుపతి.శ్రీకాళహస్తి,జనవరి18:
గాలిగోపురం దేవస్థానం కళావేదికలో ఘనంగా జరిగిన హిందూ సమ్మేళనంలో మంత్ర మహేశ్వరి, శ్రీ శక్తి పీఠాధిశ్వరి మాతాజీ, శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతి స్వామీజీ, స్థానిక సద్భావన నాయకుడు ఓలేటి సత్యనారాయణ పాల్గొని, హిందూ సమాజ ఐక్యత, కులాంతర వ్యత్యాసాలను తొలగించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.వక్తలు హెచ్చరిస్తూ, హిందూ ధర్మం, సంప్రదాయాలు, సంస్కృతిని రక్షించడం ప్రతి హిందూకి బాధ్యత అని, కులాలపై పరిమితులు లేకుండా, కలిసికట్టుగా ఉండాలి అని స్పష్టం చేశారు. భారతదేశ అభివృద్ధిలో, ప్రకృతిని సంరక్షించడంలో, సమాజ సేవలో యువత, మహిళలు ముందుండాలని సూచించారు.కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు, అనుబంధ సంస్థల సభ్యులు హాజరై, ఉత్సాహభరిత మద్దతు ప్రకటించారు.హిందూ సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి హిందూ బంధువుకి హృదయపూర్వక ధన్యవాదాలు!

