Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్అమావాస్య వేళ ముర్షద్ దర్గా వద్ద భక్తుల వెల్లువ..

అమావాస్య వేళ ముర్షద్ దర్గా వద్ద భక్తుల వెల్లువ..

📰 Generate e-Paper Clip

•ముస్లిం ఐక్యతకు ప్రతీకగా మారిన దర్గా…పూర్వికుల స్మరణతో ప్రత్యేకప్రార్థనలు,మొక్కులతో మార్మోగిన అమావాస్య వేళ ముర్షద్ దర్గా పరిసరాలు..
సదాశివపేట,జనవరి18(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ముర్షద్ దర్గా అమావాస్య రోజున భక్తులతో కిటకిటలాడింది. అమావాస్య రోజున దర్గా దర్శనం శుభకార్యమని భావిస్తూ హిందూ–ముస్లిం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.పూర్వికుల స్మరణతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, కోరికలు నెరవేరాలని భక్తులు మొక్కులు చెల్లించారు. దీపారాధనలతో దర్గా పరిసరాలు ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కొనసాగాయి.మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ముర్షద్ దర్గా వద్ద అమావాస్య సందర్భంగా భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular