📄 ePaper
Thursday, July 9, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుచిన్నారులకు ఉచిత హృదయ పరీక్షల శుభావకాశం.

చిన్నారులకు ఉచిత హృదయ పరీక్షల శుభావకాశం.

📰 Generate e-Paper Clip

ఏప్రిల్ 23, 24 తేదీలలో ఉచిత శిబిరం – పరీక్షల నుంచి శస్త్రచికిత్సల వరకు పూర్తిగా ఫ్రీ సేవలు
సిద్దిపేటనియోజకవర్గం.కొండపాక మండల్, ఏప్రిల్ 17:
కొండపాక శివారులోని శ్రీ సత్య సాయి సంజీవని హాస్పిటల్స్ బాల హృదయ సంరక్షణ పరిశోధనా కేంద్రంలో ఈ నెల 23, 24 తేదీలలో ఉచిత బాల హృదయ పరీక్ష శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో చిన్నారులకు హృదయ సంబంధిత సమస్యలపై నిపుణులచే పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సలు, కాథ్ ఇంటర్వెన్షన్స్, ఐసీయూ సంరక్షణ, శస్త్రచికిత్స అనంతర చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు.
చిన్నారులలో గుండె సమస్యలు ఉన్నట్లు అనుమానం ఉన్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
📞 వివరాలకు: 8010119000, వాట్సాప్: 7075137733.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular