•బీఆర్‌ఎస్ ఎన్నికల అబ్జర్వర్ మఠం బిక్షపతి
సదాశివపేట,జనవరి19(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణంలో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ ఎన్నికల అబ్జర్వర్, మాజీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.మహిళలకు నాలుగు నెలలుగా పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేశారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో పాటు ఐదు లక్షలు ఇస్తామన్న హామీని కూడా మర్చిపోయారని ఆరోపించారు. వికలాంగులకు రూ.6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.ఉచిత బస్సు పథకం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆటో కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే బీఆర్‌ఎస్ పార్టీ బాకీ కార్డుల ద్వారా సమాధానం చెప్పడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ప్రతి ఆడబిడ్డకు ఒక తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు చిల మల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పిలిగుండ్ల వీరేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటిల్, వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడూరి రమేష్, సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు, మాజీ కోఆప్షన్ సభ్యులు కోడూరు అంజయ్య, చిక్కుల మల్లేశం, రామ్ శెట్టి, అక్బర్ హుస్సేన్‌తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, యువజన, ఎస్సీ, మైనారిటీ, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ టికెట్ ఆశావాహులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రతి కార్యకర్తకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఎన్నికల ఇంచార్జ్ మఠం బిక్షపతి భరోసా ఇచ్చారు.
బీఆర్‌ఎస్ పార్టీ బాకీ కార్డులు ప్రతి ఇంటికి చేరవేయాలి
RELATED ARTICLES

