📄 ePaper
Sunday, October 18, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువైద్య రంగంలో తెలంగాణకు గర్వకారణం

వైద్య రంగంలో తెలంగాణకు గర్వకారణం

📰 Generate e-Paper Clip

– వెలుగు మహానంది జాతీయ అవార్డు గ్రహీత డా.శ్రీనివాస్ నాయక్‌కు ఘన సన్మానం

•వైద్య రంగంలో మరో మైలురాయి
•ప్రతిష్టాత్మక అవార్డుతో తెలంగాణకు ఖ్యాతి

సిద్దిపేటనియోజకవర్గం:మనప్రజాప్రతినిధి//జనవరి26

వైద్య రంగంలో విశిష్ట సేవలతో రాష్ట్రానికి ప్రతిష్ట తీసుకొచ్చిన వెలుగు మహానంది జాతీయ అవార్డు గ్రహీత, శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల నిపుణులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శ్రీనివాస్ నాయక్ గారిని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGLA–711) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కనుక చంద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరిపల్లి నగేష్, జిల్లా కోశాధికారి కే.రాజు,రాష్ట్రనాయకులు అశోక్, డా.మంగ్త నాయక్,జిల్లా నాయకులు గంగాధర్, పరశు రాములు, యాదగిరి, బాలకిషన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కనుక చంద్రం మాట్లాడుతూ డా. శ్రీనివాస్ నాయక్ గారు వైద్య రంగంలో అందించిన అంకితభావ సేవలు, ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను జాతీయ స్థాయిలో మరింత పెంచాయని అన్నారు. ఇలాంటి ప్రతిభావంతులను గుర్తించి గౌరవించడం సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.అనంతరం డా. శ్రీనివాస్ నాయక్ తనకు లభించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణే తన జీవిత లక్ష్యమని, భవిష్యత్తులో మరింత సేవా భావంతో వైద్య సేవలు అందిస్తానని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.