Friday, February 27, 2026
ads
Homeతెలంగాణమృతుని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపిన కల్వకుంట్ల కవిత

మృతుని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపిన కల్వకుంట్ల కవిత

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//జనగామ జిల్లా
స్టేషన్ ఘనపూర్:

జనగామ జిల్లా జాఫర్‌గడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన గాదె ఇన్నయ్య తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత గారు ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, గాదె ఇన్నయ్య త్వరలోనే తిరిగి వస్తారని భరోసా ఇచ్చారు.అనంతరం ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో మమేకమయ్యారు. పిల్లలతో మాట్లాడుతూ, మీరు ముద్దుగా పిలుచుకునే మీ డాడీ గాదె ఇన్నయ్య త్వరలోనే మీ దగ్గరకు వస్తారుఅంటూ వారికి మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ టాపింగ్ కేసును త్వరగా పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో కాలయాపన చేయడం తగదని, సమస్యలను పక్కదారి పట్టించి రాజకీయంగా మలచడం సరైంది కాదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular