📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుబ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

📰 Generate e-Paper Clip

•రైతుల రాకపోకలకు ఉపయోగపడే మోద్దుల పంపు–చెక్‌డ్యామ్ వద్ద బ్రిడ్జి పనులకు శ్రీకారం
•రూ.30 లక్షల నిధులతో ధమ్మక్కపల్లి పరిధిలో కీలక బ్రిడ్జి నిర్మాణం
•కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి
గజ్వేల్ ఇన్‌చార్జి నర్సారెడ్డి చేతుల మీదుగా బ్రిడ్జి పనుల ప్రారంభం

మనప్రజాప్రతినిధి//కొండపాక.జనవరి28
కొండపాక మండల పరిధిలోని ధమ్మక్కపల్లి గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలో మోద్దుల పంపు–చెక్‌డ్యామ్ ప్రాంతంలో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన సహకారంతో రూ.30 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి అధికారికంగా పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం అవసరమైనన్ని నిధులు కేటాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమ ప్రభుత్వమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసరి లింగారావు, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లాగిశెట్టి జ్యోతి, ఉప్ప సర్పంచ్ భారత్, కొండపాక మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్వేల్ సుదర్శన్, మాజీ ఎంపీపీ అనసూయ కనక రాములు, బైరి ప్రణీత్ రెడ్డి, మాజీ సర్పంచ్ నీలా మల్లేశం, మాజీ ఎంపీటీసీలు కనకయ్య, యాదయ్య, కొండపాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ యాదవ్, ఏఎంసీ డైరెక్టర్లు చుక్క యాదయ్య, ఆరిఫ్, రాజు, ఉప్ప సర్పంచులు కర్ణాకర్, సుధాకర్, అడ్వకేట్ రాజు, నర్సింలు, పంభాల సురేందర్, వార్డు సభ్యులు అఖిల్, రాజు, నర్సింలు, వికాస్ రెడ్డి, మల్లేశం, కిష్టయ్య, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.