_కెసిఆర్ కు సిట్ నోటీసులు హేయమైనా చర్య, కేసులకు భయపడేది లేదు, పాలన చేతకగాకే కక్ష సాధింపు..
_మహానేత కేసిఆర్ కు మకిలి అంటించడం సరికాదు..
_ఆత్మగౌరవాన్ని అవమానిస్తే గుణపాటమే
_విచారణ పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతీకారం సర్కార్ తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతు రాంబాబు
మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, జనవరి30:
తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి సాధించిన రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం ఏ హేమైనాచర్య అని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతు రాంబాబు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పిత చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడం బాధాకరమని ఆయన చావుకు సిద్ధపడి తెలంగాణ తెస్తేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయి, నోటీసుల పేరిట బిఆర్ఎస్ ని బెదిరించే యత్నం కేసులకు భయపడేది లేదు ఆత్మగౌరవాన్ని అవమానిస్తే గుణపాఠం తప్పదు రేవంత్ రెడ్డి ఖబర్దార్…

