Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుపేద చిన్నారుల గుండెల్లో మళ్లీ జీవం నింపుతున్న సత్యసాయి సంజీవని

పేద చిన్నారుల గుండెల్లో మళ్లీ జీవం నింపుతున్న సత్యసాయి సంజీవని

📰 Generate e-Paper Clip

కొండపాకలో విజయవంతంగా ముగిసిన చిన్నపిల్లల గుండె పరీక్షా శిబిరం
170 మంది పిల్లలకు 2D ఎకో పరీక్షలు-ఉచిత చికిత్సకు ఎంపిక
ఆపరేషన్లు చేయించుకున్న చిన్నారులకు సర్టిఫికెట్ల అందజేత
ఆర్థిక భారం లేకుండా ఉచిత గుండె వైద్యం: ట్రస్ట్ నిర్వాహకులు
సద్గురు శ్రీ మధుసూదన సాయిఆశీస్సులతో సేవా కార్యక్రమం

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.జనవరి31
కొండపాక మండల కేంద్రంలో గల శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నపిల్లల గుండె సంబంధిత ఉచిత పరీక్షా శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరం ద్వారా గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సద్గురు శ్రీ మధుసూదన సాయి సందేశాన్ని వెల్లడిస్తూ, చిన్నపిల్లల ఆరోగ్యమే భవిష్యత్‌కు పునాది అని పేర్కొన్నారు. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి చిన్నారికి ఉచితంగా గుండె చికిత్స అందించడమే సత్యసాయి సంజీవని ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.శిబిరంలో గుండె జబ్బు (CHD) ఉన్నట్లు అనుమానించబడిన 170 మంది చిన్నారులకు అత్యాధునిక 2D ఎకో పరీక్షలు, అవసరమైన వైద్య పరీక్షలు,ఎక్స్-రేలునిర్వహించి, కార్డియాలజిస్ట్‌లతో సంప్రదించిన అనంతరం వైద్య నిర్ధారణ చేశారు.
శస్త్రచికిత్స అవసరమైన చిన్నారులను తిరిగి పిలిపించి, సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పటికే ఆపరేషన్లు చేయించుకున్న చిన్నారులకు ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమం పేద కుటుంబాలకు వరంగా మారిందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ, సత్యసాయి సంజీవని ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular