–పూలమాలలు, శాలువలతో సత్కరించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్
-ఎన్నో సంవత్సరాల సేవలు మరువలేనివి – కమిషనర్ ప్రశంసలు
–విధినిర్వహణలో అంకితభావాన్ని కొనియాడిన పోలీస్ కమిషనర్
•పోలీస్ శాఖకు ఎనలేని సేవలు-కమిషనర్ సునీల్ దత్ ప్రశంస
ఖమ్మం,(మనప్రజాప్రతినిధి):జనవరి31
ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొని, పదవీ విరమణ పొందిన అధికారులను పూలమాలలు, శాలువలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ…ఉద్యోగ విరమణ పొందిన అధికారులు సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు. ప్రజల రక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయడం పోలీస్ శాఖకు గర్వకారణమన్నారు.
విధి నిర్వహణలో అధికారులకు నిరంతరం తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా,ఆయురారోగ్యాల తో,సుఖసంతోషాలతో భవిష్యత్ జీవితం గడపాలని ఆకాంక్షించారు.
ఉద్యోగ విరమణ పొందిన అధికారులు:
డి.రామయ్య-ఎస్సై.ఏ.గోపి-ఏఆర్ఎస్సై.ఎస్‌కె.యాకుబ్ పాషా-ఏఆర్ఎస్సై.పి.శాంతారెడ్డి-ఏఆర్ హెడ్ కానిస్టేబుల్.జి.వెంకన్న-హోంగార్డ్ (ఎఫ్‌ఎల్‌సి)ఈ సన్మాన కార్యక్రమంలోఅడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం,అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) ప్రసాద్ రావు,ఏసీపీ సుశీల్ సింగ్,ఆర్‌ఐ శ్రీశైలం, నాగుల్ మీరా,పోలీస్ అసోసియేషన్ ఇంచార్జి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు (ఏఆర్ఎస్సై), లక్ష్మణరావు,ఖమ్మం జిల్లా హోంగార్డ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బంక శ్రీను,సభ్యులు సీహెచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

