📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఫిబ్రవరి 5న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయాలి

ఫిబ్రవరి 5న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయాలి

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయ హక్కుల కోసం జాతీయ స్థాయి పోరాటంలో భాగస్వాములు కావాలి – రాజన్న సిరిసిల్ల జిల్లా డీటీఎఫ్ పిలుపు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి1
ఉపాధ్యాయులు, విద్యా రంగానికి సంబంధించిన కీలక సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ (AIJACTO) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న‘పార్లమెంట్ మార్చ్’ను విజయవంతం చేయాలని డీటీఎఫ్ (DTF) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు అవురం సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వంగ తిరుపతి మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ జాతీయ స్థాయి ఉద్యమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు.ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఈ పార్లమెంట్ మార్చ్‌ను ఈ క్రింది ప్రధాన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తోందని తెలిపారు:
సీపీఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలి.విద్యా హక్కు చట్టం అమలుకు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ (TET) నుంచి మినహాయింపు ఇవ్వాలి.వివాదాస్పద జాతీయ విద్యా విధానం (NEP)–2020ను వెనక్కి తీసుకోవాలి.ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి.ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకూడదు.కాంట్రాక్టు ఉపాధ్యాయులు, ఉద్యోగులను క్రమబద్ధీకరించి కనీస వేతన స్కేలు అమలు చేయాలి.ఎనిమిదవ సెంట్రల్ పే కమిషన్‌ను సకాలంలో అమలు చేయాలి.ఈ పార్లమెంట్ మార్చ్‌కు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయులు కూడా తమ హక్కుల కోసం గళమెత్తి, ఢిల్లీ వేదికగా ప్రభుత్వానికి తమ నిరసనను వినిపించాలని సుధాకర్ రెడ్డి, వంగ తిరుపతి పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.