📄 ePaper
Thursday, August 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిద్దిపేట భారత్‌నగర్‌లో డా. చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ తొలి వార్షికోత్సవం – ఉచిత వైద్య శిబిరం...

సిద్దిపేట భారత్‌నగర్‌లో డా. చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ తొలి వార్షికోత్సవం – ఉచిత వైద్య శిబిరం విజయవంతం

📰 Generate e-Paper Clip

సుమారు 50 మందికి కిడ్నీ పరీక్షలు, మందులపై డిస్కౌంట్‌

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకెళ్తూ, సిద్దిపేటలో కిడ్నీ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తానని డాక్టర్ చంద్రప్రకాష్ గారు ఈ సందర్భంగా తెలిపారు.
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.ఫిబ్రవరి3
సిద్దిపేట భారత్‌నగర్‌లోని డాక్టర్ చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ తొలి} వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సుమారు 50 మంది వరకు రోగులు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారని డాక్టర్ చంద్రప్రకాష్ గారు పేర్కొన్నారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉచిత ఓపీ సేవలతో పాటు వివిధ రకాల కిడ్నీ సంబంధిత పరీక్షలను డిస్కౌంట్‌తో నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను కూడా రాయితీ ధరలకు అందజేసినట్లు తెలిపారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే ల!క్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని డాక్టర్ చంద్రప్రకాష్ గారు స్పష్టం చేశారు.అదేవిధంగా, సిద్దిపేట పట్టణంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ ఆధ్వర్యంలో ముందునూ మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని నిర్వాహకులు మహేందర్, ఎల్లప్ప తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రప్రకాష్ గారితో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.